యువగళం పాదయాత్రకు మూడేళ్లు: మైలవరంలో ఘనంగా వేడుకలు

మైలవరం, జనవరి 27, 2026: ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చిన ‘యువగళం’ పాదయాత్ర నేటితో మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మైలవరం నియోజకవర్గంలో వైభవంగా వేడుకలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లైవ్ స్టాక్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ దొండపాటి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

శత్రువుల కోటలను బద్దలు కొట్టిన యాత్ర

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కేక్ కట్ చేసి కార్యకర్తలను ఉత్సాహపరిచారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. “2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభంజనానికి యువగళం పాదయాత్రే పునాది. నారా లోకేష్ చేపట్టిన ఈ సాహసోపేత యాత్ర శత్రువుల కోటలను బద్దలు కొట్టడమే కాకుండా, రాష్ట్ర ప్రజల్లో తమ భవిష్యత్తు పట్ల బలమైన భరోసాను కల్పించింది” అని కొనియాడారు.

సమస్యల నుంచి పథకాల వరకు

ఆనాడు పాదయాత్రలో లోకేష్ ప్రజల నుంచి విన్న ప్రతి కష్టం, చూసిన ప్రతి సమస్య నేడు కూటమి ప్రభుత్వంలో ఒక్కో సంక్షేమ పథకంగా మారిందని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ప్రజల అవసరాలే ఎజెండాగా ప్రస్తుతం ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ బాటలో పయనిస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు మరియు భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *