

తెలుగుదేశం పార్టీని జాతీయ స్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో 25 జిల్లాల టీడీపి పార్లమెంటరీ కమిటీల శిక్షణ శిబిరం అత్యంత ఉత్సాహంగా నిర్వహించబడింది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, యువ నాయకుడు, మంత్రి శ్రీ నారా లోకేష్ బాబు గారి నేతృత్వంలో ఈ శిక్షణా కార్యక్రమం జరిగింది.
క్షేత్రస్థాయిలోకి ప్రభుత్వ పథకాలు: చంద్రబాబు, లోకేష్ పిలుపు
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు మంత్రి లోకేష్ బాబు మాట్లాడుతూ, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడంలో పార్లమెంటరీ కమిటీల పాత్ర కీలకమని పేర్కొన్నారు.
- మై టీడీపి (My TDP) యాప్, సోషల్ మీడియా, మరియు ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియాను సమర్థవంతంగా వాడుకుంటు ప్రజలకు చేరువ కావాలని పిలుపునిచ్చారు.
పార్టీ క్యాడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతు, రానున్న రోజుల్లో దేశంలోనే అత్యంత బలమైన పార్టీగా టీడీపిని ఉంచాలి అని వారు ఆకాంక్షించారు.
వెయ్యి మందితో ఫోటో షూట్.. కార్యకర్తల్లో రెట్టింపు ధైర్యం
శిక్షణ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు సుమారు 1000 మందికి పైగా ఉన్న కమిటీ సభ్యులతో వ్యక్తిగతంగా ఫోటోలు దిగారు. అధినేతలతో నేరుగా ముచ్చటించే అవకాశం రావడం కార్యకర్తల్లో అపారమైన ధైర్యాన్ని నింపింది.
ఎమ్మెల్యే శ్రీ మామిడి గోవిందరావు (MGR) గారి ప్రతిపాదనతో నియమితులైన కమిటీ సభ్యులు ఈ శిక్షణలో పాల్గొని, భవిష్యత్ కార్యాచరణపై అవగాహన పెంచుకున్నారు.
శిక్షణలో పాల్గొన్న పాతపట్నం కమిటీ సభ్యులు
- యాళ్ల నాగేశ్వరరావు (ఉపాధ్యక్షులు)
- అనపాన రాజశేఖర్ రెడ్డి (ఆర్గనైజింగ్ సెక్రటరీ)
- అగతముడి అరుణ కుమార్ (ఆర్గనైజింగ్ సెక్రటరీ)
- బూర్లె లలిత కుమారి, కొల్ల శారద (అధికార ప్రతినిధులు)
- బైరసింగి లక్ష్మీనారాయణ (కార్యదర్శి)
“మా పాతపట్నం నియోజకవర్గ నేతలకు ఈ అద్భుతమైన శిక్షణలో పాల్గొనే అవకాశం కల్పించిన ఎమ్మెల్యే మామిడి గోవిందరావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. పార్టీ బలోపేతానికి, ప్రజా సేవకు మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని” అనపాన రాజశేఖర్ రెడ్డి గారు తెలిపారు.
