పలాసలో ఘనంగా ఎన్టీఆర్ వర్థంతి: సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ “వజ్జ బాబూరావు”

పలాస: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) వర్థంతిని పురస్కరించుకుని పలాసలో పలు సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ వజ్జ బాబూరావు గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఘన నివాళి

ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా పలాసలోని ఎన్టీఆర్ విగ్రహానికి వజ్జ బాబూరావు గారు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని దశదిశలా చాటిన మహానాయకుడి సేవలను ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలాస మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో పళ్ళు, రొట్టెలు పంపిణీ

మానవ సేవే మాధవ సేవ అనే ఎన్టీఆర్ సిద్దాంతాన్ని ఆచరిస్తూ.. పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో సేవా కార్యక్రమం చేపట్టారు. వజ్జ బాబూరావు గారు మరియు పలాస మండల తెలుగుదేశం నాయకులు కలిసి ఆసుపత్రిలోని రోగులకు పళ్ళు, రొట్టెలు పంపిణీ చేశారు.

రామాలయంలో అన్నదానం

పలాస మున్సిపాలిటీ పరిధిలోని రామాలయంలో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పలాస నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి గౌతు శిరీష గారి ఆదేశాల మేరకు, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ అన్నదానాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వజ్జ బాబూరావు గారు పాల్గొని భక్తులకు, పేదలకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *