మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో విమర్శలు ఉండాలి కానీ, వయసుకి, పదవికి గౌరవం ఇవ్వలేని స్థాయికి అంబటి దిగజారిపోయారని ఆయన మండిపడ్డారు.
అంబటిపై ఎమ్మెల్యే గోవిందరావు ఫైర్
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మాట్లాడుతూ.. “అంబటి రాంబాబు గారు.. మీరు కడుపుకి అన్నం తింటున్నారా? లేక గడ్డి తింటున్నారా? మీ సంస్కారం ఎక్కడ పాతరేశారు?” అని ఘాటుగా ప్రశ్నించారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, ఆయన తల్లిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజకీయమా? రౌడీయిజమా?
రాజకీయంగా చంద్రబాబు గారిని విమర్శించే దమ్ము లేక, ఆయన కన్నతల్లిని వివాదంలోకి లాగడం అంబటి రాంబాబు అనాగరికతకు పరాకాష్ట అని గోవిందరావు పేర్కొన్నారు. ముఖ్యమంత్రిని పట్టుకుని “ల” కారంతో నోటికొచ్చినట్టు దూషించడమే వైకాపా పార్టీ సంస్కృతిగా మారిపోయిందని ఎద్దేవా చేశారు.
ప్రజలు బుద్ధి చెబుతారు
“మీ వయసు ఎంత? మీరు మాట్లాడే భాష ఏంటి? అసలు మీరు గతంలో ప్రజా ప్రతినిధిగా ఎలా పనిచేశారని జనం ఆశ్చర్యపోతున్నారు. రాజకీయం అంటే కేవలం బూతులు మాట్లాడటం, ఎదుటివారి కుటుంబాలను రోడ్డుపైకి లాగడం కాదు,” అని హితవు పలికారు. మాజీ మంత్రి హోదాలో ఉండి ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని, ప్రజలు అంతా గమనిస్తున్నారని, త్వరలోనే అంబటి రాంబాబుకు తగిన బుద్ధి చెబుతారని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు హెచ్చరించారు.
అంబటి రాంబాబు.. అన్నం తింటున్నావా? గడ్డి తింటున్నావా? – పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ధ్వజం