మదర్ థెరిసా హైస్కూల్ లో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు.. ముఖ్య అతిథిగా వజ్జ బాబూరావు

మదర్ థెరిసా హైస్కూల్ ఆవరణలో సంక్రాంతి సంబరాలు కనుల పండుగగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ వజ్జ బాబూరావు గారు హాజరయ్యారు. ముందుగా ఆయన సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి, భోగి మంటలను వెలిగించి వేడుకలను ప్రారంభించారు.

పండుగ వేళ పాఠశాల యాజమాన్యం తమ ఉదారతను చాటుకుంది. పాఠశాలలో పనిచేస్తున్న నాన్-టీచింగ్ సిబ్బందికి ఒక్కొక్కరికి పదివేల రూపాయల (Rs. 10,000) చొప్పున పంపిణి చేసారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ వజ్జ గంగాభవాని గారు మాట్లాడుతూ.. భోగి, సంక్రాంతి, కనుమ పండుగల విశిష్టతను, మన సంస్కృతి సంప్రదాయాలను విద్యార్థులకు వివరించారు.

ఈ వేడుకల్లో భాగంగా మహిళా ఉపాధ్యాయులు రకరకాల పిండివంటలతో సందడి చేయగా, చిన్నారులు సంప్రదాయ వస్త్రధారణలో ఆటపాటలతో అలరించారు. చివరిగా పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు, తల్లిదండ్రులకు, సిబ్బందికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *